‘మిస్టర్ ఎక్స్’ సినీ ప్రమోషన్స్‌లో హీరో ఆర్య చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాశీలోని సాధువులందరూ నిజాయితీపరులు కాదని, కొందరు క్రిమినల్స్ సాధువుల వేషంలో అక్కడ దాక్కుంటారని అన్నాడు. వారికి ఎలాంటి గుర్తింపు పత్రాలు ఉండవని, పోలీసులు కూడా తమ షూటింగ్ సమయంలో ఆయుధాలు కలిగిన నకిలీ సాధువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు వెల్లడించాడు.