మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు. ‘దేవ్’ ఫేమ్ రజత్ రవిశంకర్ దర్శకత్వంలో ఆయన సినిమా చేస్తున్నాడు. ఇవాళ ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ‘దేవర’ వంటి గ్లోబల్ హిట్ అందించిన యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కీలినేని సుధాకర్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు.