NGKL: తిమ్మాజిపేట మండలం సామ్య నాయక్ తండాకు చెందిన మూడవత్ సాయికుమార్ ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో మండల టాపర్గా నిలిచాడు. ఎంపీసీ విభాగంలో 470కి గాను 467 మార్కులు సాధించి సత్తా చాటాడు. విద్యే అన్ని సమస్యలకు పరిష్కారమని ఈ సందర్భంగా సాయికుమార్ పేర్కొన్నాడు. ఘనత సాధించిన విద్యార్థిని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఘనంగా అభినందించారు.