కృష్ణా: పెనమలూరు పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చెడు నడత కలిగిన రౌడీ షీట్ హోల్డర్లు, డీసీలు, కేడీలు ఇతర సస్పెక్ట్ పీట్ హోల్డర్లను గుర్తించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని సూచిస్తూ, భవిష్యత్తులో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని SI రమేష్ హెచ్చరించారు.