పార్వతీపురం పట్టణంలోని చర్చ్ సెంటర్, అగ్రహారం వీధిలో ఉన్న డి.వి.ఎం పాఠశాలను జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల వసతులు, పరిశుభ్రతను పరిశీలించిన ఆయన, ఆవరణలో మొక్కలు నాటి విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించాలని సూచించారు. అలాగే, సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేయాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని యాజమాన్యాన్ని ఆదేశించారు.