ATP: మున్సిపాలిటీకి బకాయిలు పడ్డ ఇంటి, కుళాయి పన్నులను చెల్లించని వారి ఇళ్లకు సంబంధించిన కుళాయి కనెక్షన్లను బుధవారం సిబ్బంది తొలగించడం ప్రారంభించారు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా, ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ఈ చర్య తీసుకున్నామని కమిషనర్ శివ రామక్రిష్ణ తెలిపారు. పట్టణంలో పెండింగ్లో ఉన్న పన్నులను వెంటనే చెల్లించాలన్నారు.