NLR: కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం ఎంపీటీసీ నాగరాజు కుటుంబ సభ్యులను రాష్ట్ర ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల ఎంపీటీసీ తనయుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయన పోతిరెడ్డిపాలెంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.