బాపట్ల: జిల్లాలో ఎన్సీడీ సర్వే జాప్యంపై కలెక్టర్ వీ. వినోద్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. నూరుశాతం సర్వే పూర్తయ్యేలా చూడాలని అధికారులను గురువారం ఆదేశించారు. ఆభా(ABHA) ఐడీల ద్వారా వైద్యసేవల డిజిటలైజేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే, ఆయుర్వేద ఆస్పత్రుల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.