KRNL: గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తూ సామాన్య ప్రజలకు సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందించడంలో ఏజెన్సీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఇవాళ పత్తికొండలో భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వినియోగదారులు ఆందోళనకు దిగారు. గ్యాస్ 10 రోజుల క్రితం బుక్ చేసుకున్నా, గ్యాస్ సిలిండర్లు ఇవ్వకుండా ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపించారు.