NDL: ఆళ్లగడ్డ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల నుంచి చింతామణి వైపు వెళ్తున్న A1 ప్రైవేట్ అంబులెన్స్, ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.