VZM: జిల్లాలో జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల భూసేకరణను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జరిగిన సమీక్షలో తారకరామ తీర్థసాగర్, తోటపల్లి, జాతీయ రహదారులు, రైల్వే లైన్లు తదితర పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే ఎయిర్పోర్ట్ భూ సేకరణ పూర్తి కావాలన్నారు.