SKLM: ఆమదాలవలస పట్టణంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ హాజరై కేకు కట్ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రవికుమార్ అన్నారు.