PPM: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ పార్వతీపురంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గ్రామదేవత శ్రీ ఇప్పలపొలమ్మ అమ్మవారి ఆలయంలో జనసేన నాయకులు చందక అనీల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యంలో, ఆయన త్వరగా కోలుకుని ప్రజా సేవలో నిమగ్నం కావాలని మొక్కుకున్నారు.