MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలో లోక కళ్యాణార్ధం నిర్వహించిన శ్రీ రుద్రాయాగం-చండియాగం ఘనంగా జరిగింది. ఈ మహాయాగంలో 108 దంపతులు పాల్గొని విశేష భక్తిశ్రద్దలతో యాగ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ యాగ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి హాజరై, వేద మంత్రోచ్చారణల నడుమ ప్రతేక్య పూజలు నిర్వహించారు.