NLR: నగరంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం బంగారు తాపడంతో ధ్వజస్తంభం ఏర్పాటు చేయనున్నారు. దీనికి ఉభయకర్తలుగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు వ్యవహరిస్తున్నారు. ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు హాజరుకావాలని ఈవో జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు.