ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామిని గురువారం జిల్లా ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు ఎంపీ దంపతులను స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఎంపీ కుటుంబ సభ్యుల పేర్లు పై ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.