ELR: కవయిత్రి మొల్ల జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కవయిత్రి జయంతిని నిర్వహించారు. తెలుగులో రాసిన అనేక రామాయణాల్లో మొల్ల రామాయణం చాలా సరళమైనదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.