BPT: మంత్రి అనగాని సత్యప్రసాద్ సహకారంతో గురువారం నగరం SVRM కాలేజీలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు బుధవారం కళాశాల సెక్రటరీ బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మేళాలో 22 బహుళజాతి కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో ముందుగా నమోదు చేసుకుని, సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని కోరారు.