గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులకు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ హనుమంతు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐలు ఖాదర్ బాషా, మొహమ్మద్ సలాహుద్దీన్లను శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలిపారు.