AKP: నక్కపల్లి మండలంలో ఈ నెల 23న కురిసిన వర్షంతో పాటు వీచిన పెనుగాలులకు ముకుందరాజుపేట జగన్నాధపురం చీడిక, ఎం.నర్సాపురం తదితర గ్రామాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం ఎంపీడీవో సీతారామరాజు ఎం.నర్సాపురం గ్రామాన్ని సందర్శించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. అలాగే విద్యుత్ సరఫరాను కూడా పునరుద్ధరించినట్లు తెలిపారు.