విశాఖ కేజీహెచ్‌లో బుధవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. తన మనవరాలు ప్రియాంకకు సెలైన్ సరిగా వేయలేదని అడగగా మేల్ నర్స్ పైడ్రాజు దాడి చేశాడని వార్డు బాయ్ అప్పలస్వామి ఆరోపించాడు. ఈ ఘటనపై ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రియాంక తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.