NDL: బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామ సమీపంలో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు వ్యక్తులను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. రమేష్, లక్ష్మయ్య, నిఖిల్, చరణ్ అనే నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.