ATP: జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో 13 మందికి జూనియర్ అసిస్టెంట్లుగా కారుణ్య నియామక ఉత్తర్వులను ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్తగా విధుల్లో చేరిన వారు బాధ్యతగా పనిచేస్తూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నియామక పత్రాలు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.