KDP: ఎండాకాలం ప్రభావం, ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో లేకపోవడంతో గండికోట ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 22.228 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ ఉమా మహేశ్వర్లు తెలిపారు. తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. గండికోట ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 26.85 టీఎంసీలు ఉంటుంది.