PLD: చిలకలూరిపేట (మం) దండమూడిలో పీఎం సూర్యఘర్ అవగాహన సదస్సు ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు, మంచినీటి కేంద్రాన్ని ప్రారంభించారు. నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. కరెంటు బిల్లుల భారం తగ్గించుకునేందుకు ప్రజలు ఈ పథకాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.