SS: జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన జూనియర్ క్రీడాకారులను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఘనంగా సన్మానించారు. ముగ్గురు క్రీడాకారులకు తన స్వంత నిధులతో రూ.50 వేల విలువైన స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షిస్తూ, తనవంతు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.