KDP: కాంగ్రెస్ పార్టీ మహిళలకు అన్యాయం చేస్తోందని సీఎం చంద్రబాబు అనడం సరికాదని మాజీ ఎంపీ తులసిరెడ్డి అన్నారు. ఆదివారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్తోనే మొదలైందని, ఆ విషయాన్ని ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. 33 ఏళ్ల క్రితమే స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెసేనని గుర్తుచేశారు.