GNTR: అమరావతి 190 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ మార్గంలో వాహనాలు ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి వీలుగా కేవలం 19 చోట్ల ఇంటర్‌చేంజ్‌లు నిర్మించనున్నారు. మొదట 17 పాయింట్లను ప్రతిపాదించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆ సంఖ్యను 19కి పెంచారు. ప్రస్తుతం ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలన దశలో ఉంది.