W.G: గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రజలకు, అధికారులకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఏలూరుపాడు సర్పంచ్ భూపతిరాజు వెంకట జగ్గరాజు పేర్కొన్నారు. బుధవారం ఏలూరుపాడు ఎంపీపీ పాఠశాలలో దాతల సహకారంతో నిర్మించిన భోజనశాలను ఆయన ప్రారంభించారు. సర్పంచ్ పదవీకాలం ముగుస్తున్న సందర్భంగా ఉపాధ్యాయులు, పలువురు నాయకులు జగ్గరాజు దంపతులను ఘనంగా సత్కరించారు.