KRNL: కౌతాళం మండలం కుంభలూరు సమీపంలోని తుంగభద్ర నదిపై రెండు రాష్ట్రాలను కలిపే వంతెన నిర్మించాలని CPM సీనియర్ నాయకులు కే. మల్లయ్య డిమాండ్ చేశారు. ఇవాళ మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేంద్ర రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. కుంభలూరు వద్ద బ్రిడ్జి నిర్మిస్తే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సులభమవడంతో పాటు వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నారు.