AKP: నాతవరం బీసీ కాలనీలో శ్రీ బాల వరసిద్ధి వినాయక ఆలయ ప్రారంభోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించి అనంతరం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.