GNTR: నందివెలుగు బ్రిడ్జి పనులను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.గురువారం గుంటూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, శంకర్ విలాస్ ఆర్వోబీకి సంబంధించి రైల్వే అనుమతులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే మంగళగిరి, నంబూరు, బండారుపల్లి బ్రిడ్జిల నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తాపన్నారు.