సత్యసాయి: కదిరి పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహములను ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, హాస్టల్లో అందిస్తున్న భోజనం, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను, భోజనశాల, వంట గదులను పరిశీలించారు.