KDP: సిద్ధవటం మండలం మాధవరం-1లోని వేంకటేశ్వరపురం గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 45 రోజులుగా తాగునీటి మోటారు చెడిపోయి నీటిసరఫరా నిలిచిపోవడంతో ఇవాళ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అధికారులకు పలుసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. సంబంధిత అధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.