PPM: బలిజిపేట మండలం నారాయణపురం గ్రామంలోని చేనేత కార్మికులు నేస్తున్న చీరలకు విదేశాల్లో మంచి గిరాకీ వచ్చేటట్టు తన వంతు కృషి చేస్తామని విజయ్ చంద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అమలు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు సరఫరా చేసే ధ్రువ పత్రాలను అందజేశారు.