కోనసీమ: మార్చి 22వ తేదీన మామిడికుదురులో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్ర పటాన్ని ముద్రించాలన్న డిమాండ్‌తో ధూమ్ తడక్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జిల్లా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఈదరాడ గ్రామంలో శుక్రవారం బహిరంగ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. రెవెన్యూ కార్యాలయం దగ్గరలో సభ కార్యక్రమం జరుగుతుందన్నారు.