పార్వతీపురం జిల్లాలో పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖల ద్వారా చేపడుతున్న డోలీ రోడ్ల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనుల్లో నిర్లిప్తత పనికిరాదని తెలిపారు. పూర్తైన రోడ్ల బిల్లులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేసి, ప్రగతిలో ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు.