KDP: జమ్మలమడుగు నారాపుర వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 30న సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.