SS: గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ నివాసంలో ACB అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమాస్తులు బయటపడ్డాయి. ఉప్పరపల్లిలోని ఆయన ఇంట్లో రూ. 55 లక్షల నగదు, 221 గ్రాముల బంగారం, 685 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ. 24 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లు, విలువైన ఇంటి పత్రాలను అధికారులు జప్తు చేశారు.