ATP: మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన నిందితుడు ముత్యాల సంపత్కు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ అనంతపురం పోక్సో కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. 2020లో శింగనమల మండలంలో జరిగిన ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి చిన్నబాబు.. నిందితుడికి శిక్షతో పాటు రూ.4వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.50వేల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.