SKLM: జిల్లాలో నేర నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి రాత్రివేళల్లో డైనమిక్ బీట్ సిస్టమ్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. గంజాయి ఇతర మాదకద్రవ్యాలనియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఎస్పీ శనివారం అధికారులను ఆదేశించారు.