KDP: ప్రొద్దుటూరులోని స్థానిక మున్సిపల్ గ్రౌండ్లో శుక్రవారం సాయంత్రం మట్కా రాస్తున్న షేక్ మౌలాలి, సురేశ్‌లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి మట్కా చీటీలు, రూ.3,100లు నగదు స్వాధీనం చేసుకున్నట్లు 3-టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్, మట్కా, గుట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి,మాదకద్రవ్యాలు జోలికి వెళితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.