MBNR: జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వాలీబాల్, కబడ్డీ టోర్నమెంట్లు శనివారం ముగిశాయి. వాలీబాల్లో డిగ్రీ కళాశాల, కబడ్డీలో గౌరీశంకర్ కాలనీ జట్లు విజేతలుగా నిలిచాయి. క్రీడలు శారీరక, మానసిక దృఢత్వాన్ని ఇస్తాయని నాయకులు జనార్ధన్ రెడ్డి, అమర్నాథ్ గౌడ్ పేర్కొన్నారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.