NDL: పాణ్యం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కలెక్టర్ రాజకుమారి గణియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ సేవలు, సౌకర్యాలపై అధికారులను ప్రశ్నించారు. కలెక్టర్ రాకతో డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు మూసివేయగా వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కూడా సేకరించారు.