కోనసీమ: మార్చి 8న ద్రాక్షారామంలో జరిగే ఏఎంసీ ఛైర్మన్గా అక్కల రిశ్వంతరాయ్, డైరెక్టర్లు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం పిలుపునిచ్చారు. గురువారం ద్రాక్షారామంలో వాసవి కళ్యాణ మండపంలో కూటమి నాయకులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరోజు ముఖ్య అతిథిగా మంత్రి సుభాష్ పాల్గొంటారన్నారు.