SS: ముదిగుబ్బలోని మండల స్థాయి స్టాక్ (MLS) పాయింట్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో ఉన్న బియ్యం, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ..రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలని, లబ్ధిదారులకు సకాలంలో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.