ELR: ఉంగుటూరు మండలంలో 27 గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డు వద్ద బుధవారం ఓటర్ల జాబితా ఏర్పాటు చేశామని డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు తెలిపారు. బాదంపూడి పంచాయతీ కార్యాలయం వద్ద నోటీసు బోర్డులో ఏర్పాటుచేసిన ఓటర్ జాబితాను డిప్యూటీ ఎంపీడీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అభివృద్ధి అధికారి కె.వి గిరిధర్ పాల్గొన్నారు.