అన్నమయ్య: నిమ్మనిపల్లి మండలంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఇవాళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.