ATP: గుత్తిలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆర్ఎస్ సీఎస్ఐ చర్చి నుండి గాంధీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. చర్చి పాస్టర్స్ మాట్లాడుతూ.. మానవాళి రక్షణ కోసం ఈ లోకంలో ఏసుక్రీస్తు జన్మించారన్నారు. అందరిని సమానంగా చూడాలని, ప్రేమ, కరుణ భావాలతో మెలగాలని ఏసుక్రీస్తు పేర్కొన్నారన్నారు. సమాజ సేవలో ఉండాలని చెప్పిన కరుణామయుడు ఏసుక్రీస్తు కొనియాడారు.