ప్రకాశం: త్రిపురాంతకం (M) రాజుపాలెం BTC కాలనీ సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాజుపాలెంకు చెందిన శివన్నారాయణ బైక్పై మార్కాపురం నుంచి రాజుపాలెం వస్తుండగా.. రోడ్డుపై మరమ్మతుల నిమిత్తం నిలిపి ఉన్న లారీని వెనుక భాగాన ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.